ఏపీలో మరోసారి భారీగా కరోనా మరణాలు... 24 గంటల్లో 92 మంది మృతి

  • 3,460కి పెరిగిన కరోనా మరణాలు
  • కొత్తగా 9,927 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇంకా 89,932 యాక్టివ్ కేసులు
కరోనా వైరస్ భూతం ఏపీని పట్టిపీడిస్తోంది. గడచిన 24 గంటల్లో 92 మంది మరణించారు. కొత్తగా 9,927 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. మరో 9,419 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది, అనంతపురం జిల్లాలో 11 మంది, కడప జిల్లాలో 10 మంది, ప్రకాశం జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,460కి పెరిగింది.

తూర్పు గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో మరోసారి వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తమ్మీద 3,71,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,78,247 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. ఇంకా 89,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Deaths
Andhra Pradesh
Corona Virus
Positive Cases
COVID-19

More Telugu News